ETV Bharat / sitara

మా నాన్న గర్వపడేలా నటిస్తా: ఆకాశ్ పూరీ - puri jagannath interviews

'రొమాంటిక్' ప్రీ రిలీజ్​ హీరో ఆకాశ్ పూరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్న పూరీ జగన్నాథ్ కాలర్ ఎగరేసేలా సినిమాలు చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

vijay devarakonda romantic pre release event
రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్
author img

By

Published : Oct 23, 2021, 7:30 AM IST

"విధి నన్ను, పూరీ జగన్నాథ్‌, ఛార్మిని కలిపింది. మేం ముగ్గురం ఒక్కటే ఫిక్స్‌ అయిపోయాం. 'లైగర్‌'తో భారతదేశాన్ని ఊపేయాలని! 2022లో అది జరుగుతుంది" అని హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన శుక్రవారం వరంగల్‌లో జరిగిన 'రొమాంటిక్‌' ముందుస్తు విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ సుధారాణి వేడుకకు హాజరయ్యారు. ఆకాశ్ పూరీ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్‌ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఆయనే ఛార్మితో కలిసి నిర్మించారు. ఈ నెల 29న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

vijay devarakonda romantic pre release event
విజయ్ దేవరకొండ-ఆకాశ్ పూరీ

"ఆకాశ్​లో తపన ఉంది. ఇంత మంది మధ్య తను అనుకున్నది చెప్పే ధైర్యం ఉంది. ఆకాశ్ సినిమా పిచ్చి గురించి నాకు ఛార్మి చెబుతుంటారు. అన్ని సినిమాలూ నచ్చుతుంటాయి. నీలాంటివాళ్లు వందశాతం విజయవంతం కావాలి. కేతికకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా నిర్మాత, రచయత ఛార్మి, పూరీ జగన్నాథ్‌ నా మనుషులు. 'లైగర్‌' కోసం వీళ్లు ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు" అని విజయ్ దేవరకొండ అన్నారు.

"వరంగల్‌ ప్రజలకు కళాకారులంటే పిచ్చి. మాకు వరంగల్‌ అంటే సెంటిమెంట్‌. ఇకపై ప్రతీ సంబరం ఇక్కడే చేసుకుంటాం. 'రొమాంటిక్‌' సినిమా అనిల్‌ చాలా బాగా తీశాడు. ఎక్కడా బోర్‌ కొట్టదు. ఆకాశ్, కేతిక, రమ్య చాలా బాగా నటించారు. చాలా ట్రెండీగా ఉండే సినిమా. మా అబ్బాయి చిన్నప్పట్నుంచి ఉదయం లేవగానే ఓ డైలాగ్‌ చెప్పి ఓ వేషం అని అడిగేవాడు. దర్శకుడిగా తన గురించి ఒక మాటే చెబుతాను, వాడు మంచి నటుడు. రమ్యకృష్ణ వల్ల ఈ సినిమా జాతకమే మారిపోయింది. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన ప్రభాస్‌ డార్లింగ్‌కు కృతజ్ఞతలు చెబుతున్నా. విజయ్‌ దేవరకొండతో 'లైగర్‌' చేస్తున్నాను, తన నటన నాకే షాకింగ్‌గా ఉంది" అని పూరీ జగన్నాథ్ అన్నారు.

vijay devarakonda akash puri
'రొమాంటిక్' టీమ్​తో విజయ్ దేవరకొండ

"దర్శకుడు, మా బృందం అంతా ప్రాణం పెట్టి చేశాం. ఎలాంటి నేపథ్యం లేకున్నా కష్టపడి పరిశ్రమ అనే మహాసముద్రంలో దూకారు మా నాన్న. మధ్యలో పూరీ కెరీర్‌ అయిపోయిందని అన్నారు. 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో ఆయనిచ్చిన ఊపు మామూలుది కాదు. థియేటర్లలో మా నాన్న సంభాషణలు విని ఎగురుతుంటే కాలర్‌ ఎగరేశా. అలా మా నాన్న కూడా గర్వపడేలా నేను నటిస్తా. మా నాన్న పరిశ్రమ కోసం ఎంతో ఇచ్చారు. నేను ఈ పరిశ్రమలో పుట్టి పెరిగాను. మా నాన్న పరిశ్రమకు ఇచ్చినదానికంటే ఇంకో శాతం ఎక్కువే ఇస్తాను. ఓ లక్ష్యం ఉండాలని చెబుతుంటారు మా నాన్న. ఇకపై మా నాన్న కాలర్‌ ఎగరేసేలా చేయడమే నా లక్ష్యం" అని ఆకాశ్ పూరీ అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.