ETV Bharat / sitara

'బాలాకోట్​ దాడి' సినిమాలో విజయ్​ దేవరకొండ! - 'బాలాకోట్​ దాడి' సినిమాలో విజయ్​ దేవరకొండ!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాలాకోట్​ దాడి' నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరో విజయ్​ దేవరకొండ నటించనున్నాడని టాక్​. ప్రస్తుతం పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడీ రౌడీహీరో.

vijay devarakonda
విజయ్​ దేవరకొండ
author img

By

Published : Sep 24, 2020, 6:02 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన 'బాలాకోట్​ దాడి' కథాంశంతో బాలీవుడ్​లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు సంజయ్​లీలా భన్సాలీ ఇటీవల ప్రకటించాడు. 'కేదార్‌నాథ్‌' దర్శకుడు అభిషేక్‌ కపూర్‌ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.

తాజాగా ఇందులో టాలీవుడ్​​ హీరో విజయ్​ దేవరకొండ నటించనున్నట్లు టాక్​. ఇప్పటికే దీనిపై రౌడీ హీరోతో చిత్రబృందం చర్చలు జరపగా.. విజయ్​ సుముఖత చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో 'ఫైటర్' (పరిశీలనలో ఉంది)​ సినిమాలో నటిస్తున్నాడు విజయ్​. ఇందులో అనన్యా పాండే హీరోయిన్​గా కనిపించనుంది. ఈ చిత్రంతో బాలీవుడ్​లో అరంగేట్రం చేయనున్నాడీ రౌడీ హీరో.​

ఇదీ చూడండి తొలిసారి సినిమా ఛాన్స్​ అలా వచ్చింది : శ్రియ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.