ETV Bharat / sitara

'ఇప్పట్లో మా ఇద్దరికి పెళ్లి ఆలోచన లేదు' - నయనతార విఘ్నేష్​ శివన్​ న్యూస్​

తమకు ఇప్పటిలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ అన్నారు. వివాహం త్వరలో జరగనుందనే అసత్య ప్రచారాలు ఆపాలని విజ్ఞప్తి చేశారు.

vignesh shivan nayanthara about marriage
vignesh shivan nayanthara
author img

By

Published : Aug 31, 2020, 7:23 PM IST

Updated : Aug 31, 2020, 7:32 PM IST

తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్, హీరోయిన్​ నయనతార మధ్య గత కొన్నేళ్లుగా ప్రేమాయణం కొనసాగుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం ఊపందుకుంది. ఈ విషయమై ఇప్పుడు స్పందించాడీ డైరెక్టర్.

"నయన్​తో వివాహం గురించి చాలామంది అడుగుతున్నారు. త్వరలోనే మేమిద్దరం ఒక్కటవ్వనున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇందులో నిజం లేదు. ప్రస్తుతం మా కెరీర్​పైనే దృష్టి సారించాం. మా లక్ష్యాలు కొన్ని ఉన్నాయి. వాటిని సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలనుకుంటున్నాం. ఇంతకన్నా మరో కారణం లేదు. మాకు తెలియకుండా చాలా ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పట్లో అయితే ఎలాంటి ఆలోచన లేదు"

-విఘ్నేశ్​ శివన్​, తమిళ దర్శకుడు

ఓనమ్​ పండగ సందర్భంగా, ప్రియుడు విఘ్నేశ్​తో​ కలిసి కేరళ వెళ్లింది నయనతార. తన కుటుంబ సభ్యులతో ఓనమ్​ను జరుపుకొనేందుకు చెన్నై నుంచి ప్రత్యేక విమానాన్ని ఈమె బుక్​ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో నయన్​తో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు విఘ్నేశ్​.

విఘ్నేశ్ శివన్​ 'కాతువాకుల రెండు కాదల్'​ సినిమాకు ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్​ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Last Updated : Aug 31, 2020, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.