విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం 'జంగ్లీ'. ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. జాకీచాన్ అంతర్జాతీయ ఫిల్మ్ వీక్లో రెండు పురస్కారాలను ఈ చిత్రానికి ఎంపికచేసింది అవార్డు కమిటీ. బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్, పోరాటాలకు ప్రత్యేక జ్యూరీ బహుమతిని ప్రదానం చేసింది.
"భారత్లోనే అన్ని పోరాట దృశ్యాలను చిత్రీకరించాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. కొత్తగా ఏదైనా ప్రయత్నించి ఇతరులకు చూపిస్తే.. ఇది ఇంతకుముందు జాకీ చాన్ చేసేశాడుగా అనేవారు. ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. జ్యూరీకి ప్రత్యేక ధన్యవాదాలు" -విద్యుత్ జమ్వాల్, హీరో
ఏనుగు దంతాల రవాణాపై యువతను చైతన్య పరచడానికే 'జంగ్లీ' చిత్రాన్ని తీశామని తెలిపాడు విద్యుత్.
"40 ఏళ్లుగా భారత్లో నిజమైన జంతువులతో సినిమాలు తీయట్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఏనుగు దంతాల రవాణా జరుగుతోంది. ఈ విషయంపై నూతన తరానికి అవగాహన లేదు. ఈ చిత్రం ద్వారా ఆ అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాం" -విద్యుత్ జమ్వాల్, హీరో
ఈ యాక్షన్ - అడ్వెంచర్ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు ఛక్ రసెల్ తెరకెక్కించాడు. జంగ్లీ పిక్చర్స్ పతాకంపై వినీత్ జైన్, ప్రీతీ జైన్ నిర్మించారు. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: దిశా ఈజ్ బ్యాక్.. మళ్లీ జిమ్లో కసరత్తులు