పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం 'అజ్ఞాతవాసి'. టాలీవుడ్లో ఈ సినిమాకు అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. కానీ, హిందీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి అనూహ్యరీతిలో స్పందన వస్తోంది. యూట్యూబ్‌లోని ఈ సినిమా హిందీ వర్షన్‌కు 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ నేపథ్యంలో 'అజ్ఞాతవాసి' చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ విలక్షణ నటుడు విద్యుత్ జమ్వాల్ కూడా ఈ కథ ఫిదా అయ్యాడట. దీంతో ఇందులో నటించేందుకు అతను ముందుకొచ్చాడట.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నీరజ్ పాండే ఈ రీమేక్‌ను తెరకెక్కించనున్నారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అక్షయ్ కుమార్ 'రుస్తుం' సినిమా రూపొందించిన టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. అక్కడి నెటివిటీకి తగ్గట్టు కథలో మార్పు చేయనున్నారని సమాచారం.
2018లో భారీ అంచనాల మధ్య విడుదలైన 'అజ్ఞాతవాసి' చిత్రం పవన్ ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేసింది. ఇందులో పవన్ సరసన కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయల్ నాయికలు నటించారు. ఇందులో ఖుష్బూ, ఆది పినిశెట్టి, బొమన్ ఇరానీ, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, ఇంద్రజ, పవిత్ర లోకేశ్, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాలను సమకూర్చారు.
ఇదీ చూడండి: 'పవన్' హిందీ సినిమాకు 100 మిలియన్ వ్యూస్