పలు తెలుగు చిత్రాలతో పాటు హిందీలోనూ నటిస్తున్న అదాశర్మ.. నటుడు విద్యుత్ జమ్వాల్‌తో డేటింగ్ ఉందా?.. సరిగ్గా ఇలాంటి సందేహమే ఓ నెటిజన్‌కు వచ్చింది. వీరిద్దరూ 'కమాండో 2', 'కమాండో 3' సినిమాల్లో కలిసి నటించడమే ఈ అనుమాం రావడానికి కారణం. ఈ విషయమై స్పందించిన విద్యుత్... తనదైన రీతిలో సమాధానమిచ్చాడు.
ఇద్దరి మధ్య ఏం లేదని, అదా తన స్నేహితురాలు మాత్రమే అని చెప్పుకొచ్చాడు విద్యుత్. ధైర్యవంతులం, దూరదృష్టి గల, భేషజాలు లేని మనస్తత్వాలు తమవని చెప్పిన ఈ నటుడు.. ఆలోచింపజేసే విషయాలను ఆమె తనతో పంచుకుంటుందని తెలిపాడు.
'హార్ట్ఎటాక్', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'క్షణం', 'కల్కి' వంటి తెలుగు చిత్రాల్లో కనిపించి మెప్పించింది అదాశర్మ. 'శక్తి', 'ఊసరవెల్లి' వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు విద్యుత్.