అలనాటి బాలీవుడ్ నటి విద్యాసిన్హా మృతి చెందారు. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని జుహు ఆసుపత్రిలో 71 ఏళ్ల వయుసులో కన్నుమూశారు.
రజినీగంధ, ఛోటి సీ బాత్, పతి పత్నీ ఔర్ ఓ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 70, 80 దశకాల్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న విద్య అనంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు.
2011లో సల్మాన్‌ఖాన్ హీరోగా వచ్చిన బాడీగార్డ్ చిత్రంతో పునరాగమనం చేశారు. అనంతరం టీవి సిరీయల్స్లోనే ఎక్కువగా నటిస్తూ.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించారు.
ఇది చదవండి: సమీక్ష: పర్ఫెక్ట్ థ్రిల్లర్.. 'ఎవరు'!