బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్ అటవీశాఖ అధికారిణిగా తెరపై కనిపించనుంది. వన్యప్రాణులపై కథాంశంతో తెరకెక్కనున్న కొత్త చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. కొన్ని వార్తల ప్రకారం.. 'అవ్ని' అనే ఆడపులిని చంపటం చూట్టూ ఈ కథ రూపొందుతోంది. అటవీ శాఖ అధికారుల సమాచారం ప్రకారం మహారాష్ట్రలో ఆడపులి 13 మందిని చంపినందుకు గానూ.. అవ్నిని 2018 నవంబర్‌లో షూటర్ కాల్చి చంపాడు.
అయితే, ఈ చిత్రం అవ్ని కేసు ఆధారంగా కాదని.. మనిషి-జంతు సంఘర్షణల ప్రధానాంశంగా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాల కోసం అధికార ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. ఈ సినిమాకు టైటిల్‌ను ఖరారు చేయలేదు. అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. విద్యా బాలన్ ఈ చిత్రం తర్వాత గణిత శాస్త్రజ్ఞురాలు శకుంతల దేవిపై తెరకెక్కే బయోపిక్‌లో కనిపించనుంది. ఈ చిత్రం మే 8 న విడుదల కానుంది.
ఇదీ చూడండి.. వైరల్: సారా, కార్తీక్ లెమన్ స్పూన్ డాన్స్