ETV Bharat / sitara

విద్యాబాలన్​కు పిచ్చి పట్టిందనుకున్నారు!

author img

By

Published : Aug 10, 2020, 1:47 PM IST

Updated : Aug 10, 2020, 2:05 PM IST

సిల్క్​స్మిత బయోపిక్​ 'డర్టీ పిక్చర్' చేస్తున్న సమయంలో చాలామంది తనకు పిచ్చిపట్టిందని భావించినట్లు నటి విద్యాబాలన్ చెప్పింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వెల్లడించింది.

విద్యాబాలన్​కు పిచ్చి పట్టిందనుకున్నారు!
నటి విద్యాబాలన్

'డర్టీ పిక్చర్‌' సినిమాకు సంతకం చేసినప్పుడు తనకు పిచ్చి పట్టిందని కొందరు భావించినట్లు బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ చెప్పింది. పక్కింటి అమ్మాయి అనిపించేంతగా దగ్గరైన తాను.. ఇలాంటి చిత్రాలు చేయకూడదని కొందరు సూచించినట్లు తెలిపింది.

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన 'డర్టీ పిక్చర్'.. అలనాటి తార సిల్క్‌స్మిత బయోపిక్. ఇందులో తన పాత్రకు ప్రాణం పోసిన విద్య, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

"దర్శకుడు మిలాన్‌ నాపై విశ్వాసం ఉంచారు. ఆయనకున్న కళాసౌందర్యం కారణంగా ఈ సినిమా చెత్తగా ఉండదని నాకనిపించింది. ఏక్తా ఈ చిత్రానికి నిర్మాత. ఆమె కూడా ఓ మహిళ. తనతోనే నేను కెరీర్‌ను ప్రారంభించాను. ఆ రకంగా చూసుకుంటే భద్రంగానే ఉంటాననిపించింది. కానీ కొందరు మాత్రం నన్ను పిచ్చిపట్టిందా? అని అడిగారు. పక్కింటి అమ్మాయిలా కనిపించే నువ్వు ఇలాంటి చిత్రాలు చేయకూడదన్నారు"

-విద్యాబాలన్, బాలీవుడ్ నటి

ఈ సినిమాలో నటించేప్పుడు విద్య తన తల్లిదండ్రుల సలహా కూడా అడిగారు. "ఆ సమయంలో దీనిపై నా తల్లిదండ్రులతో మాట్లాడటం గుర్తుంది. వారు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కాదు. కానీ, 'నీకు సరైంది అనిపించింది చేయి' అని చెప్పారు. అప్పుడు నాకు నేను ఆలోచించుకోగా, ఈ సినిమా చేయడమే ఉత్తమని నిర్ణయించుకొన్నాను" అని విద్యాబాలన్ వెల్లడించారు.

2011లో విడుదలైన 'డర్టీ పిక్చర్​'లో ఇమ్రాన్‌ హష్మి, తుషార్‌ కపూర్‌, నసీరుద్దీన్‌ షా లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. విద్య చివరగా గణిత మేథావి 'శకుంతలా దేవీ' బయోపిక్​లో టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్ర దర్శకురాలు అను మేనన్‌.

Last Updated : Aug 10, 2020, 2:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.