అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(Oscars 2022)లో సభ్యులుగా చేరాలని ఈ ఏడాదికి గానూ 395 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్‌కు ఆహ్వానం అందింది. వీరిలో బాలీవుడ్ నటి విద్యా బాలన్‌తో పాటు (Vidya Balan Ekta Kapoor) నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ ఇందులో ఉన్నారు.
ఈ ఆహ్వానాన్ని అంగీకరించిన వారికి, వచ్చే ఏడాది మార్చి 27న జరిగే 94వ ఆస్కార్ అవార్డుల విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆస్కార్ గ్రహీతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఉన్నారు. ఆండ్రా డే, హెన్రీ గోల్డింగ్, వెనెస్సా కిర్బీ, రాబర్ట్ ప్యాటిన్సన్, యాహ్యా అబ్దుల్-మతీన్ IIకు కూడా ఈ ఏడాది ఆహ్వానం లభించింది.
ఎంతమందికి అవకాశం
94వ అకాడమీ అవార్డ్స్ వేడుకను 2022 మార్చి 27న నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది కేవలం 395 మందిని మాత్రమే ఆహ్వానించారు. గతేడాది 819 మందిని ఓటింగ్ ప్రక్రియ కోసం పిలవగా.. ఇప్పుడు అందులో దాదాపు సగం మందినే అనుమతించడం గమనార్హం. ఈ ఏడాది అహ్వానం పొందిన వారిలో 46 శాతం మంది మహిళలు, 39 శాతం పురుషులు ఉన్నారు. ఇందులో పాల్గొనేందుకు దాదాపుగా 49 దేశాల(అమెరికా కాకుండా) నుంచి సినీ ప్రముఖులు తరలి రానున్నారు. వీరిలో 89 మంది గతంలో ఆస్కార్‌కు నామినేట్ అవ్వగా.. 25 మంది ఆస్కార్ గ్రహీతలు ఉన్నారు.
-
It's time to announce our new members! Meet the Class of 2021. https://t.co/17gbIEXOzJ #WeAreTheAcademy
— The Academy (@TheAcademy) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">It's time to announce our new members! Meet the Class of 2021. https://t.co/17gbIEXOzJ #WeAreTheAcademy
— The Academy (@TheAcademy) July 1, 2021It's time to announce our new members! Meet the Class of 2021. https://t.co/17gbIEXOzJ #WeAreTheAcademy
— The Academy (@TheAcademy) July 1, 2021
విద్యా బాలన్.. అనేక ఐకానిక్ చిత్రాలతో అకాడమీ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో 'కహానీ', 'తుమ్హరీ సులూ' చిత్రాలు నటిగా ఆమెకు మరింత గుర్తింపు తెచ్చాయి. ఆ తర్వాత 'పా', 'భూల్ భులియా', 'పరిణీతా', 'బాబీ జసూస్', 'ది డర్టీ పిక్చర్', 'శకుంతలా దేవీ' చిత్రాలతో ప్రపంచస్థాయిలో ఆమె అభిమానులను సంపాదించుకుంది.
ఆస్కార్‌లో బాలీవుడ్ నటులు
గతంలో ఈ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ ప్రముఖుల్లో ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొణె, ఇర్ఫాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, సల్మాన్ ఖాన్‌తో పాటు దర్శకనిర్మాతలు గౌతమ్ గౌస్, బుద్ధదేబ్ దాస్‌గుప్తా ఉన్నారు.
గతేడాది జరిగిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఐఎంపీఏఎస్)లో సభ్యులుగా 819 కళాకారులు, ఎగ్జిక్యూటివ్స్‌కు ఆహ్వానం అందింది. వారిలో బాలీవుడ్ తారలు ఆలియా భట్, హృతిక్ రోషన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా ఉన్నారు. వీరితో పాటే క్యాస్టింగ్ డైరెక్టర్ నందిని శ్రీకాంత్, డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ నిష్ట జైన్, షర్లీ అబ్రహం, అమిత్ మాధేషియా, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ విశాల్ ఆనంద్, సందీప్ కమల్‌లు ఈ జాబితాలో ఉన్నారు.
ఇదీ చూడండి.. ఆస్కార్ సభ్యులుగా ఆలియా భట్, హృతిక్ రోషన్