ప్రపంచ మానవాళి జీవితాలను బలితీసుకుంటున్న మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19). ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్యసేవలను అందిస్తున్న వైద్య సిబ్బందికి బాలీవుడ్ నటి విద్యాబాలన్ 1000 పీపీఈ కిట్స్‌ను విరాళంగా అందజేసింది. అంతేకాదు ఈ సంక్షోభ సమయంలో అందరూ వారికి అండగా నిలవాలని కోరుతోందీ 'మిషన్ మంగళ్' నటి. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.
"నమస్తే ఇప్పుడు మనందరం మన ఆరోగ్య రక్షణ సైనికులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కోసం ప్రతి ఒక్కరూ తమవంతుగా సహాయం చేయాలి. ఈ పీపీఈ కిట్స్ నిధికి సహకరించే ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు."
-విద్యాబాలన్, హీరోయిన్
తెలుగు నటి సిల్క్ స్మిత జీవితాధారంగా వచ్చిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో నటించి పేరు తెచ్చుకుంది విద్యాబాలన్. అటు హిందీ చిత్రాలతో పాటు దక్షిణాది చిత్రాల్లోను నటిస్తోంది. ప్రస్తుతం 'హ్యూమన్ కంప్యూటర్'గా పిలుచుకుంటున్న గణిత మేధావి శకుంతలాదేవి బయోపిక్‌లో నటిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">