ETV Bharat / sitara

సిల్క్ స్మితలా కనిపించట్లేదని అన్నారు: విద్యాబాలన్

బయోపిక్​ల్లో టైటిల్​ రోల్స్ చేయడం గురించి చెప్పిన నటి విద్యాబాలన్.. 'ది డర్టీ పిక్చర్' సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు చేసిన వ్యాఖ్యలను వెల్లడించారు.

సిల్క్ స్మితలా కనిపించట్లేదని అన్నారు: విద్యాబాలన్
నటి విద్యాబాలన్
author img

By

Published : Jul 25, 2020, 12:38 PM IST

బయోపిక్స్‌లో నటించాలంటే వ్యక్తిని అనుకరించకూడదని, అర్ధం చేసుకోవాలని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అంటుంది. విభిన్న కథలు, మహిళా ప్రాధాన్య చిత్రాలతో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం 'శకుంతలాదేవి'లో నటించింది. హ్యుమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవితంగా ఆధారంగా దీనిని తెరకెక్కించారు. జులై 31న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యా.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

shakunthala devi cinema poster
శకుంతలాదేవి సినిమా పోస్టర్

"బయోపిక్‌లో నటిస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి జీవిత సారాంశాన్ని అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. బయోపిక్‌ చేస్తున్నాం కదా అని ఆ వ్యక్తిలా కనిపించడం కోసం హావభావాలను.. స్వరాన్ని అనుకరించకూడదు. మనం నేర్చుకోవాల్సిన అంశం ఇదే. 'ది డర్టీ పిక్చర్' తీస్తున్నప్పుడు నేను సిల్క్‌ స్మితలా కనిపించట్లేదని ఆ చిత్ర దర్శకుడు మిలాన్‌ లుత్రియానే చెప్పారు. అలాగే శకుంతలా దేవిలా నేను కనిపించను. కాబట్టి వ్యక్తుల జీవిత సారాంశాన్ని మాత్రమే గ్రహించి నటించాలి" అని విద్యాబాలన్‌ చెప్పారు.

ఈ సినిమా కంటే ముందు 'ది డర్టీ పిక్చర్‌'(సిల్క్‌ స్మిత బయోపిక్), 'నో వన్‌ కిల్ల్‌డ్‌ జెస్సికా'(సబ్రినా లాల్‌ కేసు ఆధారంగా), 'మిషన్‌ మంగళ్‌'(తారా షిండే పాత్ర) చిత్రాల్లో నటించిన విద్యాబాలన్.. బాలీవుడ్​లో బయోపిక్​ల ఎక్స్‌పర్ట్‌గా మారిపోయారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.