ETV Bharat / sitara

'ఒక్కో సీన్ అద్భుతం.. డబ్బింగ్ చెప్పగలనా అనుకున్నా' - వెంకటేశ్ నారప్ప అమెజాన్ ప్రైమ్

విక్టరీ వెంకటేశ్(Daggubati Venkatesh) హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నారప్ప'(Narappa). ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ పలు విషయాలు పంచుకున్నారు.

Venkatesh
వెంకటేశ్
author img

By

Published : Jul 19, 2021, 7:57 PM IST

కరోనా మహామ్మారిని ప్రజలు తేలిగ్గా తీసుకోవద్దని ప్రముఖ సినీనటుడు విక్టరీ వెంకటేశ్(Daggubati Venkatesh) విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. తన తాజా చిత్రం 'నారప్ప'(Narappa) ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్​ ఓటీటీలో విడుదలవుతున్న సందర్భంగా ఆ చిత్ర విశేషాలను అభిమానులతో పంచుకున్న వెంకటేశ్.. తన సినీ జీవితంలో అత్యంత భావోద్వేగానికి గురై చేసిన చిత్రం 'నారప్ప'గా పేర్కొన్నారు. గత చిత్రాల కంటే అత్యంత సహజంగా నారప్ప ఉంటుందని తెలిపిన వెంకీ.. సామాజిక అంశాన్ని జోడిస్తూ తీసిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తుందన్నారు. వెంకటేశ్ చెప్పిన మరిన్ని విశేషాలు చూద్దాం.

వెంకటేశ్ ఇంటర్వ్యూ
  • ఏ సినిమా అయినా వందశాతం కష్టపడి పనిచేయాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు మూడు ఎమోషనల్‌ సన్నివేశాలు ఉంటాయి. అలాంటివి నా కెరీర్‌లోనే ఎప్పుడూ చేయలేదు. డబ్బింగ్‌ చెప్పే సమయంలో కూడా నాకు 'నేను చెప్పగలనా?' అని అనుమానం వచ్చింది.
  • ఎక్కువ భాగం షూటింగ్ అనంతపురం, మధురైలో చేశాం. కొంత భాగం హైదరాబాద్​లో పూర్తి చేశాం. మూవీ చాలా బాగా వచ్చింది.
  • మూవీలో రెండు పాత్రలను బాగా ఎంజాయ్ చేశా. కానీ 'నారప్ప' పాత్ర ఎక్కువగా ఇష్టపడ్డా. కొత్త గెటప్, మెల్లగా నడవడం, డైలాగ్స్​ ఇలా ప్రతిదీ కొత్తగా అనిపించింది.
  • నిజంగానే భావోద్వేగానికి గురయ్యా. నారప్ప పాత్ర అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది. కుటుంబంతో కలిసి చూడగలిగే మంచి చిత్రం ఇది. నేను కూడా ఎప్పుడెప్పుడూ చూద్దామా అని ఎదురుచూస్తున్నాను.

ఇవీ చూడండి: Narappa: 'అలాంటి పాత్ర దక్కడం అదృష్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.