Vicky Katrina Reception: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్-కత్రినా వివాహ బంధంలోకి అడుగుపెట్టేశారు. రాజస్థాన్‌లోని సెవెన్సెన్స్ ఫోర్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం గురువారం ఘనంగా జరిగింది. స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. సెలబ్రిటీస్ ఎవ్వరికీ అనుమతి ఇవ్వలేదు. అయితే వచ్చేవారం ముంబయిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్‌కు సెలబ్రిటీస్ హాజరుకానున్నారు.
మరోవైపు.. నాలుగు రోజుల పాటు జరిగే విక్కీ-కత్రినా పెళ్లి పూర్తి వీడియో హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందట. ఇందుకోసం దాదాపు రూ.80 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇది నెటిజన్లకు అందుబాటులో రానుందని సమచారం.
ఇదీ చూడండి: Vicky-katrina wedding: విక్కీ-కత్రినా పెళ్లి.. అబ్బో ఎన్ని విశేషాలో?