ETV Bharat / sitara

కరోనాను జయించిన బిగ్​బీ అమితాబ్ బచ్చన్ - అమితాబ్ కరోనా

Amitabh Bachchan testing negative for COVID19
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Aug 2, 2020, 4:59 PM IST

Updated : Aug 2, 2020, 5:23 PM IST

16:54 August 02

వైద్య పరీక్షల్లో నెగిటివ్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి

దాదాపు మూడువారాల పాటు కరోనాతో పోరాడిన బాలీవుడ్​ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఎట్టకేలకు కోలుకున్నారు. నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చెబుతూ ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారని, నాన్న కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు రాసుకొచ్చారు.  

జులై 11న అమితాబ్​, అభిషేక్ కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో బిగ్​బీ కోడలు ఐశ్వర్యారాయ్, ఆమె కుమార్తె ఆరాధ్య వైరస్​ సోకినట్లు తేలింది. వీరిద్దరూ త్వరగానే కోలుకున్నారు. ఇప్పుడు అమితాబ్ కోలుకున్నారు. అభిషేక్ మాత్రం ఇంకా చికిత్స తీసుకుంటూనే ఉన్నారు.

Last Updated : Aug 2, 2020, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.