"మనిషి తలరాత రాసే శక్తి దేవుడికి ఉందని నీ నమ్మకం.. ఆ రాతను తిరిగి రాసే శక్తి మనిషి ప్రేమకు ఉందని నా నమ్మకం" అని అంటున్నాడు విక్టరీ వెంకటేశ్. ఇతడు హీరో నాగచైతన్యతో కలిసి నటిస్తున్న చిత్రం 'వెంకీమామ'. ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అటు నవ్విస్తూనే, ఇటు మాస్ అంశాలున్న ఈ ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాలు పెంచుతోంది.
"నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు మామ.. చివరికి నీ వల్ల కూడా కాదు", "ఈసారి జాతరను రంగులతో కాదు.. మీ రక్తంతో ఎరుపెక్కిస్తా" వంటి డైలాగ్‌లు అలరిస్తున్నాయి.
ఇందులో వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, నాగచైతన్య పక్కన రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. బాబీ దర్శకత్వం వహించాడు. సురేశ్‌బాబు-టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">