ఇటీవలే ‘ఎఫ్ 2’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోని ఫుల్ జోష్‌లోకి వచ్చాడు హీరో వెంకటేశ్. ఈ జోరులోనే నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ను షురూ చేశాడు. ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో క్రేజీ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నాడీ కథానాయకుడు.
ఈ మధ్యే బాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన ‘దే దే ప్యార్ దే’ను త్వరలో రీమేక్ చేయనున్నాడు వెంకటేశ్. నిర్మాత సురేశ్‌బాబు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. యాభై ఏళ్ల వయసులో.. పాతికేళ్ల కొడుకు వుండీ, భార్యతో విడాకులు తీసుకున్న వ్యక్తి తన కుమారుడి వయసున్న అమ్మాయితో ప్రేమలో పడి ఎటువంటి చిక్కుల్ని ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథ.
ఇది చదవండి: అందం.. అభినయం.. బేబీ సొంతం