ETV Bharat / sitara

'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' టీజర్​ వచ్చేసింది - Uma Maheshwara Ugra Roopasya

'కేరాఫ్​ కంచరపాలెం' ఫేమ్​ వెంకటేశ్​ మహా తెరకెక్కిస్తున్న 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' చిత్రం టీజర్​ విడుదలైంది. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో నరేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

ugrarupasya
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' టీజర్​ విడుదల
author img

By

Published : Feb 21, 2020, 12:25 PM IST

Updated : Mar 2, 2020, 1:31 AM IST

మలయాళంలో విజయవంతమైన 'మహేశింతే ప్రతీకారమ్‌' చిత్రం రీమేక్​గా తెలుగులో 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'గా రానుంది. 'కేరాఫ్‌ కంచరపాలెం' లాంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన వెంకటేశ్‌ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నరేశ్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

శోభూ యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ మూవీలో సత్యదేవ్‌ ఫొటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడు.

ఇదీ చూడండి : వర్షం అడ్డంకి: మొదటి రోజు ముగిసిన ఆట.. భారత్ 122/5

Last Updated : Mar 2, 2020, 1:31 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.