నిజ జీవితంలో మామ-అల్లుడైన విక్టరీ వెంకటేశ్-నాగచైతన్య.. వెండితెరపై అదే పాత్రల్లో నటించిన సినిమా 'వెంకీమామ'. నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఇన్స్టాలో ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు వెంకీ. 'మిస్ యు నాన్న' అంటూ ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ రామానాయుడును గుర్తు చేసుకున్నాడు.
రామానాయుడు.. తన కొడుకు వెంకటేశ్, మనవళ్లు రానా, నాగచైతన్యతో కలిసి ఓ మల్టీస్టారర్ తీయాలని కలలు కన్నారు. కానీ అది నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు. చాలా రోజుల తర్వాత ఇప్పటికి 'వెంకీమామ'తో ఆ కాంబినేషన్ కొంతవరకు కుదిరింది.
వెంకటేశ్ ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో చైతూతో కలిసున్న కొన్నేళ్ల క్రితం, ఇప్పటి ఫొటోలను ఉన్నాయి. ఈ రెండూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
'వెంకీమామ'.. కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కింది. రాశీఖన్నా, పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించారు. బాబీ దర్శకత్వం వహించాడు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. సంయుక్తంగా నిర్మించాయి.
ఇది చదవండి: రివ్యూ: మామా అల్లుళ్ల సందడే 'వెంకీమామ'