రీమేక్ చిత్రాల్లో ఎక్కువగా నటించిన కథానాయకుల్లో వెంకటేశ్ ఒకరు(venkatesh drushyam movie) . అలా ఇటీవల 'నారప్ప' (అసురన్ రీమేక్)తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన మరికొన్ని రోజుల్లో 'దృశ్యం 2'తో థ్రిల్ పంచబోతున్నారు. 'దృశ్యం' సినిమాకు కొనసాగింపుగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రమిది. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న 'దృశ్యం 2'కు రీమేక్‌గా రూపొందింది. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా నవంబరు 25 నుంచి ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్' వేదికగా స్ట్రీమింగ్ కానుంది(venkatesh drishyam 2 release date). ఈ సందర్భంగా వెంకటేశ్ చిత్ర విశేషాలను తెలిపారు.
'దృశ్యం 2' ఎలా మొదలైంది?
వెంకటేశ్: 'దృశ్యం'(drishyam 2 amazon prime video) సినిమాలోని రాంబాబు (కథానాయకుడి పాత్ర) ఎదుర్కొన్న సమస్య మీ అందరికీ తెలుసు. తప్పో ఒప్పో తన కుటుంబం కోసం పోరాడతాడు. క్రైమ్ జానర్‌లో ఫ్యామిలీ ఎమోషన్ ఉన్న ఇలాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అందుకే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. దానికి సీక్వెల్ చేయాలని చాలామంది అడిగేవారు. ఆ స్పందనతోనే మరో 'దృశ్యం' ఆవిష్కరణకు బీజం పడింది. సుమారు ఆరేళ్లకు అది కార్యరూపం దాల్చింది. దర్శకుడు జీతూ జోసెఫ్ 'దృశ్యం 2'ను అద్భుతంగా తెరకెక్కించారు. తొలి భాగానికి మించిన ఎమోషన్, థ్రిల్లింగ్ అంశాలు ఇందులో ఉన్నాయి. తన ఫ్యామిలీ కోసం రాంబాబు ఈసారి ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.
థియేటర్లు తెరచుకున్నా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు?
వెంకటేశ్: నటుడిగా నా పని నేను పూర్తి చేశాను. సినిమా విడుదల అనేది దర్శకనిర్మాతల ఇష్టప్రకారం జరుగుతుంది. కొవిడ్ సమయంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సినిమాను థియేటర్లలో విడుదల చేయడం మంచిదా, ఓటీటీలో బెటరా అనే విషయం గురించి నేను ఎక్కువగా ఆలోచించడంలేదు(drishyam 2 ott platform). ఈ విషయంలో అభిమానులు ఫీలవుతారని తెలుసు. కానీ, కొన్నిసార్లు తప్పదు.. ఓపిక పట్టాలి. నా తదుపరి చిత్రాలు థియేటర్లలోనే సందడి చేస్తాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రీమేక్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు. కారణమేంటి?
వెంకటేశ్: నేను వెంటవెంటనే సినిమాలు చేయాలనుకుంటా. ఈ క్రమంలో అలా జరుగుతుంటుంది. పాజిటివ్ ఆలోచనతో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను కానీ అదే కావాలి, ఇదే చేయాలి అని అనుకోను. కథ, నా పాత్ర నచ్చితే చాలు ఎందులో అయినా నటిస్తా. ఎందుకో ఏమో అందరూ ‘మీరు ఎక్కువగా రీమేక్ చిత్రాలు ఎంపిక చేసుకుంటారేంటి?’ అని అడుగుతుంటారు. ఆయా పాత్రలకు నేను సరిపోతాననుకుని దర్శకనిర్మాతలు నన్ను సంప్రదిస్తుంటారు. అంతే తప్ప మరే కారణం లేదు.
'దృశ్యం 3' ఆలోచన ఉందా?
వెంకటేశ్: 'దృశ్యం 2'కు కొనసాగింపుగా 'దృశ్యం 3'(drishyam 3 movie) తెరకెక్కించాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. జీతూ మైండ్‌లో ఏముందో నాకు తెలియదు. ఒకవేళ ఈ సీక్వెల్‌ను తీయాలంటే కథను రాయడానికే సుమారు మూడేళ్ల సమయం పడుతుంది.
'ఎఫ్ 3' సంగతులేంటి?
వెంకటేశ్: 'ఎఫ్ 2'కు ఎంతగా నవ్వించిందో అంతకు నాలుగైదు రెట్లు నవ్వులు పంచుతుంది 'ఎఫ్ 3'(f3 venkatesh movie). ఈ సినిమా తప్పకుండా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది. కొన్ని రోజుల క్రితమే క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలిఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.
తదుపరి చిత్రాలేంటి?
వెంకటేశ్: చాలామంది యువ దర్శకులు కథలు వినిపిస్తున్నారు(venkatesh upcoming movies). ఇప్పటి వరకు ఏ సినిమాకీ సంతకం చేయలేదు. ఖరారైన వెంటనే ఆ వివరాల్ని తెలియజేస్తా. ప్రస్తుతానికి రానాతో కలిసి ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్' ప్రాజెక్టులో నటిస్తున్నా. అవకాశం వచ్చినప్పుడు దానికోసం 100 శాతం కష్టపడదాం. పని లేనప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉందాం. ప్రపంచాన్ని చుట్టేద్దాం. అందరూ బాగుండాలని కోరుకుందాం. వీటికి మించింది ఏముంది?.. అనే ఆలోచనతో ముందుకు సాగుతుంటా.
ఇదీ చూడండి: రాశీఖన్నాకు బాలీవుడ్లో మరో బడా ఆఫర్!