'వెంకీమామ'తో హిట్ అందుకున్న విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'అసురన్' రీమేక్ చేస్తున్నాడీ దగ్గుపాటి హీరో. తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు పలు పోస్టర్లను విడుదల చేసింది చిత్రబృందం.

మాస్ లుక్‌తో వెంకటేశ్ ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్లు సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచేశాయి. కుటుంబ కథలను తెరకెక్కించడంలో దిట్టగా పేరొందిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ఎలా రూపొందిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఇవీ చూడండి.. ప్రియాంకా చోప్రాకు అరుదైన గౌరవం