నటుడు మంచు మోహన్‌బాబు 'సన్నాఫ్ ఇండియా'గా ముస్తాబవుతున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకుడు. మంచు విష్ణు నిర్మాత. ఇళయరాజా స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రంలో 11వ శతాబ్దంలో వేదాంత దేశిక కవి రచించిన 'రఘువీర గద్యం'ను శ్రావ్యమైన పాటగా వినిపించనున్నారు. క్లిష్టమైన సంస్కృత సమాసాలతో సాగే గద్యమిది. శ్రీరామచంద్రుని గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగుతుంటుంది. ఇప్పుడిలాంటి క్లిష్టమైన గద్యానికి బాణీ కట్టాల్సిందిగా ఇళయరాజాను కోరారు మోహన్‌బాబు. దీనికి సంబంధించి ఇటీవల చెన్నైలో జరిగిన ఈ మ్యూజిక్ సిట్టింగ్ వీడియోను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో మోహన్‌బాబు "జయజయ మహావీర మహాధీర ధోళియ" అంటూ రఘువీర గద్యాన్ని ఆశువుగా తన నోట పలికించగా.. "ఏంటి ఇంత కఠినంగా ఉంది. ఏం చేసేది? ఎలా చేసేది? ట్యూన్‌కు ఎలా వస్తుంది?" అని ఇళయరాజా బదులివ్వడం నవ్వులు పూయించింది. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ పూర్తయిందని సమాచారం.
ఇది చదవండి: 'ఉప్పెన' చిత్రబృందంపై బాలయ్య ప్రశంసలు