మెగా హీరో వరుణ్‌తేజ్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ఓ బాక్సింగ్ క్రీడాకారుడిగా నటిస్తున్నాడు. ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ఇప్పటికే విడుదలైంది. కరోనా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో జులై నుంచి క్లైమాక్స్ చిత్రీకరించనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. దీంతో షూటింగ్ కోసం వరుణ్ తేజ్ జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో పంచుకున్నాడు.
-
Loading...... 🔥@IAmVarunTej
— Renaissance Pictures (@RenaissanceMovi) June 29, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Getting into the zone of a Boxer 🥊#Ghani @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/WJUtklLAgj
">Loading...... 🔥@IAmVarunTej
— Renaissance Pictures (@RenaissanceMovi) June 29, 2021
Getting into the zone of a Boxer 🥊#Ghani @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/WJUtklLAgjLoading...... 🔥@IAmVarunTej
— Renaissance Pictures (@RenaissanceMovi) June 29, 2021
Getting into the zone of a Boxer 🥊#Ghani @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @george_dop @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/WJUtklLAgj
తేజా సజ్జా కొత్త చిత్రం
యువ కథానాయకుడు తేజా సజ్జా, శివాని రాజశేఖర్ జంటగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను జులై 1న మధ్యాహ్నం 12.24 గంటలకు నేచురల్ స్టార్ నాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'పొగరు' ట్రైలర్
ధ్రువ్ సార్జా, రష్మిక జంటగా నటించిన 'పొగరు' చిత్రం మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇకపై డిజిటల్ మాధ్యమంలో అలరించనుంది. ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా జులై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్ ఘట్టాలతో, భావోద్వేగ సన్నివేశాలతో, భారీ సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది ఈ ప్రచార చిత్రం. నాయకానాయికల నటన ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అల్లరి నరేశ్ కొత్త చిత్రం
ఈ ఏడాది 'నాంది' చిత్రంతో మెప్పించిన అల్లరి నరేశ్.. మరో కొత్త చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 58వ చిత్రానికి సంబంధించి.. బుధవారం (జూన్ 30) ప్రకటన రానుంది.

ఓటీటీలో 'డాక్టర్'
శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డాక్టర్'. ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయిక. ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.



ఇదీ చూడండి.. Narappa: 'నారప్ప' సెన్సార్ పూర్తి.. ఓటీటీలో రిలీజ్!