మొదటి సినిమా నుంచి వైవిధ్యమైన కథలతో అలరిస్తున్న నటుడు వరుణ్ తేజ్. మెగా వారసుడిగా వచ్చి తనదైన శైలి చిత్రాలతో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. తొలి చిత్రం 'ముకుంద' నుంచి ఇటీవల వచ్చిన 'ఎఫ్ 2' వరకు ప్రతిదీ ఓ సరికొత్త జోనర్‌కు సంబంధించిన కథాంశంతో తెరకెక్కినదే. ప్రస్తుతం 'వాల్మీకి' కోసం ఇదే బాటలో నడిచాడు. తొలిసారిగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యాడు.
ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే.. తదుపరి సినిమానూ పట్టాలెక్కిస్తున్నాడు ఈ యువ హీరో. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ డ్రామాగా రూపొందబోయే ఈ మూవీలో వరుణ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.
అల్లు వెంకటేష్, సిద్ధు సంయుక్తంగా నిర్మించబోయే ఈ చిత్రం ఆగస్టు నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందట. కథానాయిక ఎవరు? ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. కథరీత్యా ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా దిల్లీ, వైజాగ్, హైదరాబాద్ ప్రాంతాల్లో జరగనుందట.
'వాల్మీకి' చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి.. పెళ్లి పాటతో అదరగొడుతున్న సల్మాన్, కత్రినా