ETV Bharat / sitara

రవితేజ కొత్త చిత్రం.. 'వరుడు కావలెను' సాంగ్

author img

By

Published : Oct 2, 2021, 1:14 PM IST

సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'వరుడు కావలెను', రవితేజ కొత్త చిత్రం, 'కోల్డ్ కేస్' తెలుగు రిలీజ్​ వంటి సినిమా విశేషాలు ఉన్నాయి.

Raviteja
రవితేజ

నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu). ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 15న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న ఈ చిత్ర యూనిట్ తాజాగా ఓ సాంగ్​ను రిలీజ్ చేసింది. 'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు' అంటూ సాగే పాటను విడుదల చేసింది. గీతామాధురి అండ్‌ కో ఈ పాటను ఎంతో హుషారెత్తించేలా ఆలపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మాస్ మహారాజ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్​ ప్రారంభ తేదీని ప్రకటించింది చిత్రబృందం. అక్టోబర్ 4 నుంచి రెగ్యులర్ షూట్ జరుపుతామని వెల్లడించింది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతమందిస్తున్నారు.

Raviteja new film announcement
రవితేజ కొత్త చిత్రం

‌మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ నటించిన థ్రిల్లర్ 'కోల్డ్‌ కేస్'. 'అరువి' ఫేమ్‌ అదిత్‌ బాలన్‌ ముఖ్యపాత్రలో నటించింది. తను బాలక్‌ దర్శకుడు. 'మెమొరిస్‌', 'పోలీస్‌ పోలీస్‌', 'సెవన్త్‌ డే', 'రావణ్‌' సినిమాల్లో పోలీసుగా అదిరిపోయేలా నటించిన పృథ్వీరాజ్‌ మరోసారి ఈ సినిమా కోసం ఖాకీ చొక్కా తొడిగాడు. ఓ మర్డర్‌ కేసును పరిష్కరించే పోలీసు ఆఫీసర్‌ సత్యజిత్​గా ఇందులో ఆయన కనిపించి అలరించాడు. మాతృకను అమెజాన్ ప్రైమ్​ విడుదల చేయగా.. తాజాగా ఈ సినిమాను తెలుగులో 'ఆహా' విడుదల చేయనుంది. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రీమియర్ కానుంది.

cold case
కోల్డ్​కేస్

ఇవీ చూడండి: రాకింగ్​ రాకేశ్ ప్రపోజల్​ ​.. రోహిణి అంగీకరించిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.