హరీశ్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో వస్తోన్న'వాల్మీకి' సినిమా ప్రీ టీజర్ సోమవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైలాగ్‌లేమీ లేకుండా చేతిలో తుపాకీ, కంటికి సుర్మా పెట్టుకొని గడ్డంతో మాస్ లుక్‌లో కనిపించాడు వరుణ్‌తేజ్. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. 18 సెకన్ల నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రాన్ని అభిమానులతో పంచుకొంటూ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్.
-
And I welcome my brother @Atharvaamurali to TFI with #Valmiki pic.twitter.com/DIzqLypisb
— Varun Tej Konidela (@IAmVarunTej) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">And I welcome my brother @Atharvaamurali to TFI with #Valmiki pic.twitter.com/DIzqLypisb
— Varun Tej Konidela (@IAmVarunTej) June 24, 2019And I welcome my brother @Atharvaamurali to TFI with #Valmiki pic.twitter.com/DIzqLypisb
— Varun Tej Konidela (@IAmVarunTej) June 24, 2019
"మీరెప్పుడూ చూడని లుక్‌లో కనిపిస్తున్నా. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా’" అని పోస్టు చేశాడు వరుణ్ తేజ్. దీంతో పాటు వాల్మీకి చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్‌ను కూడా నెట్టింట పంచుకున్నాడు. తమిళ నటుడు అధర్వ లుక్‌ను షేర్ చేసిన వరుణ్... తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఆయనకు స్వాగతం పలికారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ‘వాల్మీకి’ తెరకెక్కుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">