ETV Bharat / sitara

క్రేజ్ కా బాప్.. ట్విట్టర్​లో 'వకీల్ సాబ్' రికార్డు జోరు

author img

By

Published : Mar 3, 2020, 9:02 PM IST

"అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. స్వామి ఇది నీ దర్శనం. ఇది నిదర్శనం." ఈ డైలాగ్​ ఖలేజా సినిమాలోనిది. ఈ డైలాగ్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌కు అన్వయించుకోవచ్చు. 'వకీల్​సాబ్​' సినిమా ఫస్ట్​లుక్​ అందుకు నిదర్శనంగా నిలిచింది.

vakheel saab firstlook making new records in twitter
ట్విట్టర్​లో సరికొత్త రికార్డుతో వకీల్​సాబ్​ ఫస్ట్​లుక్​

'వకీల్​ సాబ్​' సినిమాతో పవర్​స్టార్​ రీఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా నల్ల కళ్లద్దాలు పెట్టుకుని, పుస్తకం పట్టుకుని ప్రశాంతంగా కూర్చున్న ఫోటోనే సంచలనం సృష్టించింది. సినిమాల్లో గ్యాప్‌ వచ్చినా అతడి క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని ఇది నిరూపించింది. ట్విట్టర్‌లో అత్యధికంగా చర్చించిన చిత్రంగా ట్రెండింగ్​లో నిలిచింది.

vakheel saab firstlook making new records in twitter
'వకీల్​సాబ్'​ ఫస్ట్​లుక్​ రికార్డ్స్​

ఇప్పటివరకు ఏ చిత్రానికి ఇలాంటి ఘనత దక్కలేదు. దేశవ్యాప్తంగా.. విడుదలైన 24 గంటల్లో అత్యధికంగా రీట్వీట్లు (25.3కే) చేసిన తొలి తెలుగు సినిమా ఫస్ట్‌లుక్​గా.. అత్యధికంగా (3.5మిలియన్‌) టైటిల్‌ ట్యాగ్‌ ట్వీట్‌ చేసిన చిత్రంగా 'వకీల్‌ సాబ్‌' రికార్డు సృష్టించింది. హిందీలో విజయవంతమైన 'పింక్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాతలు. బోనీ కపూర్‌ సమర్పకుడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని తొలిపాటను విడుదలచేయున్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి.. చందమామే పక్కనుంటే అది షాలినీలానే ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.