పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'వకీల్‌సాబ్'. బాలీవుడ్ చిత్రం 'పింక్'కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని తన పాత్ర షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు పవన్. అయితే కొత్త సంవత్సరం వస్తోన్న తరుణంలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ గురించి పవర్‌స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారి ఉత్సాహాన్ని గమనించిన చిత్ర యూనిట్ ఎట్టకేలకు 'వకీల్‌సాబ్' అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
గురువారం అర్ధరాత్రి 12 గంటలకు 'వకీల్‌సాబ్' అప్డేట్ రాబోతుందంటూ ప్రకటించింది చిత్రబృందం. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అంజలి, నివేదా థామస్, శ్రుతి హాసన్ కీలకపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.