ETV Bharat / sitara

వకీల్​సాబ్​.. 'కంటిపాప' ఫుల్​ వీడియో సాంగ్ రిలీజ్​

author img

By

Published : May 4, 2021, 3:50 PM IST

'వకీల్​సాబ్'​ సినిమాలోని మరో గీతం 'కంటిపాప కంటిపాప' పూర్తి వీడియో పాట​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటలో పవన్‌, శ్రుతి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. దీన్ని మీరు చూసేయండి...

vakeel saab
వకీల్​సాబ్​

'వకీల్‌ సాబ్' సినిమా నుంచి మరో పూర్తి వీడియో సాంగ్‌ వచ్చేసింది. 'కంటిపాప కంటిపాప' అనే మెలోడీని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం. పవన్‌ కల్యాణ్‌, శ్రుతి హాసన్‌పై తెరకెక్కిన గీతమిది. ఈ పాటలో పవన్‌, శ్రుతి కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. వీళ్ల ప్రేమ, పెళ్లి, శ్రుతి సీమంతం తదితర సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్‌లో విజయం అందుకున్న 'పింక్‌' ఆధారంగా శ్రీరామ్‌ వేణు 'వకీల్‌ సాబ్‌'ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇటీవల థియేటర్లో సందడి చేసిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అలరిస్తోంది. దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన 'మగువా మగువా' ఫిమేల్‌ వెర్షన్‌ ఫుల్‌ వీడియో విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.

ఇదీ చూడండి: 'మగువా మగువా' పుల్ వీడియో సాంగ్ రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.