పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన 'వకీల్‌సాబ్' చిత్రంలోని 'కదులు కదులు' పాటను ఏప్రిల్ 6న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. వేణు శ్రీరామ్ దర్శకుడు. బోనీకపూర్ సమర్పణలో దిల్‌రాజు నిర్మించారు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. ఇందులో పవన్ న్యాయవాదిగా కనిపించనున్నారు. తమన్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్ర టైటిల్‌ను ఉగాది పండగకు ప్రకటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించనున్నాడు. జిబ్రాన్ స్వరాలు సమాకూర్చనున్నాడు. పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్మాతగా, రచయితగా మారి తెరకెక్కించిన '99 సాంగ్స్' సినిమా. సోమవారం ఈ చిత్రంలోని నీ చూపే నాకు వీడియో సాంగ్ విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. జియో స్టూడియోస్‌తో కలిసి రెహమాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి సహ రచయిత, దర్శకుడు కాగా.. హీరో హీరోయిన్లుగా కొత్తవారైన ఇహాన్ భట్, ఎడిల్సే వర్గాస్ పరిచయం కానున్నారు. వీరితో పాటు సీనియర్ నటీమణులు మనీషా కొయిరాలా, లిసా రే కూడా 99 సాంగ్స్ చిత్రంలో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మనవడి సినిమాకు కృష్ణ దర్శకత్వం!