వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలోని 'సత్యమేవ జయతే' లిరికల్ సాంగ్‌ను మార్చి 3 సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నారు. బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా.. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. సాయిపల్లవి, కృతిశెట్టి కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా సెట్లో అడుగుపెట్టిన బెంగాలీ నటుడు జిషూ సేన్ గుప్తాకు ఘనస్వాగతం పలికింది చిత్రబృందం. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో జిషూ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

నితిన్ ప్రసన్న, ప్రీతి అశ్రానీ జంటగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'ఏ' చిత్ర ట్రైలర్ విడుదలైంది. 'యుద్ధానికి కావాల్సింది గమ్యం.. అది తిరిగి రాలేనిదైనా నాకు సంతోషమే' అంటూ హీరో చెప్తున్న డైలాగ్ ఆ పాత్ర స్వభావాన్ని పరిచయం చేస్తుంది. ఈ చిత్రాన్ని యుగంధర్ ముని తెరకెక్కిస్తున్నారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. మార్చి 5న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించబోతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతోన్న కొత్త చిత్రం 'సీటీమార్'. కబడ్డీ నేపథ్యంతో తెరకెక్కనున్న సినిమాలో.. గోపీచంద్ సరసన హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను మార్చి 3న ఉదయం 9.46గంటలకు హీరోయిన్ సమంత విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'వకీల్‌సాబ్'లో పవన్ మార్క్ సాంగ్!