ETV Bharat / sitara

'వకీల్​సాబ్​' చిత్రంపై ఫిర్యాదు! - పవన్​కల్యాణ్​ వార్తలు

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'వకీల్​సాబ్​' చిత్రంపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. సినిమాలో హీరోయిన్​ అంజలి ఫొటోతో పాటు తన చరవాణి నంబరు జత చేయడం వల్ల గుర్తు తెలియని వ్యక్తులు కాల్​ చేసి వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు.

Vakeel Saab movie faces charges of invasion of privacy
'వకీల్​సాబ్​' చిత్రంపై ఫిర్యాదు!
author img

By

Published : May 4, 2021, 7:42 AM IST

అనుమతి లేకుండా 'వకీల్‌సాబ్‌' చిత్రంలోని ఓ సన్నివేశంలో తన ఫోన్‌ నంబరును ఉపయోగించారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కథానాయిక అంజలికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా మార్చినట్లు సినిమాలో ఓ సన్నివేశం ఉందని.. అందులో అంజలి ఫోటో కింద తన ఫోన్‌ నంబరు ఉన్నట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తరచూ ఫోన్లు వస్తున్నాయని సుధాకర్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్​ చేసిన వారు తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆయన పోలీసులకు తెలిపారు. చిత్ర యూనిట్‌ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. అయితే పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.

ఇదీ చూడండి: 'సలార్'​ స్పెషల్​ సాంగ్​లో 'కేజీఎఫ్​' భామ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.