మెగాహీరో వైష్ణవ్‌తేజ్ హాకీ ప్లేయర్‌గా మారబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అతడు.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో కొత్త దర్శకుడు పృథ్వీతో ఓ సినిమా చేయనున్నాడని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడా సినిమా కోసమే హాకీ ఆటగాడిగా కనిపించేందుకు వైష్ణవ్ సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ చిత్రంలో మిగతా నటీనటులను ఎంపిక చేసే ప్రక్రియలో చిత్రబృందం ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. ఇటీవలే హాకీ నేపథ్యంలో హీరో సందీప్ కిషన్ 'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమాతో వచ్చి విజయాన్ని అందుకున్నాడు.
ఇదీ చూడండి: గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ చిత్రం