ETV Bharat / sitara

ఆ పాత్రలో నటించడం మరిచిపోలేని అనుభూతి: రకుల్​ - కొండపొలం ట్రైలర్

'కొండపొలం' సినిమాలో గ్రామీణ ప్రాంత అమ్మాయిగా, అందులో గొర్రెలు కాసే యువతిగా నటించడం మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పింది హీరోయిన్​ రకుల్​ ప్రీత్​ సింగ్​. దర్శకుడు క్రిష్​తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.

rakul
రకుల్​
author img

By

Published : Oct 5, 2021, 10:10 AM IST

Updated : Oct 5, 2021, 10:39 AM IST

మెగా హీరోలతో వరుస సినిమాలు చేయడం తనకెంతో కలిసి వస్తుందని యువ కథానాయిక రకుల్ ప్రీత్​సింగ్​ ఆనందం వ్యక్తం చేసింది. వాళ్ల కళ్లల్లో ఏదో మ్యాజిక్ ఉంటుందని చెప్పిన రకుల్​.. వైష్ణవ్ తేజ్​తో కలిసి క్రిష్ దర్శకత్వం వహించిన 'కొండపొలం' చిత్రంలో నటించిన అనుభవాన్ని వెల్లడించింది. గ్రామీణ ప్రాంత అమ్మాయిగా, అందులోనూ గొర్రెలు కాసే యువతిగా నటించడం మరిచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చిందని చెప్పింది. వైష్ణవ్ తేజ్​తో కలిసి ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ​ ఈ విషయాల్ని చెప్పుకొచ్చింది.

రకుల్​ ప్రీత్​ సింగ్​, వైష్ణవ్​ తేజ్​

"ఈ సినిమాలోని ఆ భాష స్లాంగ్ మాట్లాడటం అంత ఈజీ కాదు.​ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రెస్పాన్స్​ బాగా వస్తుంది. నాది చాలా మంచి పాత్ర. ఎంతో ప్రేమగా ఉంటుంది. ఈ రోల్​లో నటించేందుకు గొర్రెల కాపరి వాళ్ల వీడియోలను చూశా. వారి బాడీలాంగ్వేజ్​ నేర్చుకున్నా. ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూసి ఉండరు. దర్శకుడు క్రిష్​తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చాలా తెలివైన వ్యక్తి. తన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. మళ్లీ మళ్లీ ఆయనతో సినిమాలు చేయాలని ఉంది."

-రకుల్ ప్రీత్​ సింగ్​, హీరోయిన్​.

"ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. విభిన్న కథలను ఎంచుకోవడం అలా జరిగిపోతుంది. రెండో సినిమాకే క్రిష్​తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయనకు కృతజ్ఞతలు. ఈ చిత్రం, అందులోని నా పాత్ర డిఫరెంట్​గా ఉంటుంది. స్పీడ్​గా ఎలా పనిచేయాలి, ఇంకా చాలా విషయాలు రకుల్​ నుంచి నేర్చుకున్నా."

-వైష్ణవ్​ తేజ్​, హీరో

నల్లమల అడవుల్లో గొర్రెల కాపరుల జీవితాల నేపథ్యంగా తెరకెక్కింది 'కొండపొలం' సినిమా. దర్శకుడు క్రిష్​ ఈ మూవీని రూపొందించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేసిన ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇదీ చూడండి:

KondaPolam movie: అడవి మలచిన యువకుడి కథ

kondapolam movie: 'ఈ సినిమా షూటింగ్‌.. ఓ సాహసయాత్ర'

Last Updated : Oct 5, 2021, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.