క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, రకుల్‌ప్రీత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరింది. 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రిష్.. 35 రోజుల్లోనే సినిమా పూర్తి చేయడం విశేషం. వికారాబాద్ అటవీ ప్రాంతంలో ఒకే షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశారు. 'కొండపొలం' నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తున్న క్రిష్.. కరోనా నేపథ్యంలో ఆ సినిమాకు విరామమిచ్చారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పకడ్బందీగా, వైష్ణవ్, రకుల్‌ల మరో సినిమా పూర్తి చేశారు.