మెగా హీరో వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. మొదటి చిత్రం 'ఉప్పెన' విడుదలకు ముందే మరో సినిమాను పూర్తి చేశాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది. తాజాగా ఈ యువ హీరో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ మూడో చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మించనున్నారని సమాచారం. ఈ సినిమాతో కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నాడట. వేసవిలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుందని టాలీవుడ్ టాక్.
వైష్ణవ్ తొలి చిత్రం 'ఉప్పెన' ఇటీవలే థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి 14 ఏళ్ల 'చిరుత' రికార్డును బ్రేక్ చేసింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించగా, కృతిశెట్టి హీరోయిన్గా మెరిసింది. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో మెప్పించాడు.