బాలీవుడ్ నుంచి కొత్త వార్తలు వచ్చాయి. సల్మాన్‌ఖాన్ 'రాధే'తో పాటు రణ్వీర్-దీపిక నటించిన '83', అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' విడుదలపై స్పష్టత వచ్చింది.
థియేటర్లలోనే భాయ్ సినిమా
'రాధే' సినిమా నేరుగా ఓటీటీలో రానుందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టిన చిత్రబృందం.. థియేటర్లలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. వచ్చే ఈద్ కానుకగా రానుంది. ఇందులో సల్మాన్ సరసన దిశా పటానీ హీరోయిన్. ప్రభుదేవా దర్శకుడు.

మార్చి 31లోపు విడుదల
లాక్డౌన్ ప్రభావంతో వాయిదాలు పడుతూ వస్తున్న రణ్వీర్ సింగ్ '83', అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' సినిమాలు.. వచ్చే ఏడాది మార్చి 31లోపు థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా రిలీజ్ డేట్స్‌ను ఖరారు చేయలేదని తెలిపారు.
