*హీరో నాగచైతన్య.. ఇన్‌స్టాలో మూడు మిలియన్ ఫాలోవర్ల మార్క్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఇతడు నటించిన 'థాంక్యూ', 'లవ్‌స్టోరి' సినిమాలు విడుదల కావాల్సిఉన్నాయి. థియేటర్ల తెరిచే విషయమై క్లారిటీ వస్తే, ఆ రెండు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
*అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయన కొత్త చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. 'సభకు నమస్కారం' టైటిల్‌తో పాటు న్యూలుక్‌ను విడుదల చేశారు. ఇందులో నరేశ్ నమస్కారం పెడుతున్న పోజులో ఉన్నారు. అతడి వెనక జేబులో లిక్కర్ బాటిల్, నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. దీనిబట్టి ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందే ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సతీశ్ మల్లెంపాటి దర్శకుడు. మహేశ్ కోనేరు నిర్మాత.
*ఫర్హాన్ అక్తర్ 'తుఫాన్' చిత్ర ట్రైలర్ విడుదలైంది. బాక్సింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. మృణాల్ ఠాకుర్ హీరోయిన్. జులై 16 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'తుఫాన్' స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*హీరోయిన్ అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా, ఆమె నటిస్తున్న సినిమాల నుంచి కొత్త పోస్టర్లు విడుదలయ్యాయి. అందులో భాగంగా అవికాకు చిత్రబృందాలు శుభాకాంక్షలు తెలియజేశాయి.