ETV Bharat / sitara

చిరు 'ఆచార్య' రీస్టార్ట్.. వేసవికి సినిమా విడుదల - మెగాస్టార్ చిరంజీవి తాజా వార్తలు

చిరు 'ఆచార్య' షూటింగ్ మరో ఐదు రోజుల్లో మొదలు కానుంది. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. దీనితో పాటే బాలీవుడ్ చిత్రాలు 'భూత్ పోలీస్', 'రష్మీ రాకెట్​' చిత్రీకరణ కూడా మొదలైంది.

updates from chiru 'acharya', 'bhoot police', tapsee 'rashmi rocket'
చిరు 'ఆచార్య' రీస్టార్ట్.. వేసవికి సినిమా విడుదల
author img

By

Published : Nov 4, 2020, 11:40 AM IST

మెగాస్టార్ చిరంజీవి.. 'ఆచార్య' సెట్​లో తిరిగి అడుగుపెట్టనున్నారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత నవంబరు 9 నుంచి షూటింగ్​లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దాదాపు నెలరోజుల పాటు కొత్త షెడ్యూల్​ జరగనుందని తెలిపారు. వచ్చే వేసవి థియేటర్లలోనే సినిమా విడుదల కానుందని స్పష్టం చేశారు.

'ఆచార్య'లో కాజల్ హీరోయిన్. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరు తనయుడు రామ్​చరణ్.. ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

chiru acharya cinema update
చిరు ఆచార్య సినిమా అప్​డేట్

'భూత్ పోలీస్' మొదలు

సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'భూత్ పోలీస్' షూటింగ్.. బుధవారం నుంచి హిమాచల్ ప్రదేశ్​లో ప్రారంభమైంది. ఈ విషయాన్నే చెబుతూ పోస్టర్​ను విడుదల చేశారు. పవన్ కృపలాని దర్శకుడు, రమేశ్ తారాని, ఆకాశ్ పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

bhoot police poster
భూత్ పోలీస్ కొత్త పోస్టర్

రష్మీ రాకెట్ షురూ

తాప్సీ ప్రధాన పాత్రలో, క్రీడా కథాంశంతో తీస్తున్న సినిమా 'రష్మీ రాకెట్'. ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో అథ్లెట్​గా కనిపించనుంది తాప్సీ. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తుండగా, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.

rashmi rocket cinema
తాప్సీ రష్మీ రాకెట్ సినిమా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.