ETV Bharat / sitara

టాలీవుడ్​పై తమిళ హీరోల దండయాత్ర! - విజయ్​ బీస్ట్​

Upcoming Kollywood movies 2022 : టాలీవుడ్​లో కోలీవుడ్​ చిత్రాల హవా కొనసాగుతోంది. త్వరలోనే కొంతమంది తమిళ హీరోలు తమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. మరి ఆ చిత్రాల్లేంటో చూసేద్దాం..

Upcoming Kollywood movies 2022
Upcoming Kollywood movies 2022
author img

By

Published : Feb 19, 2022, 12:56 PM IST

Upcoming Kollywood movies 2022 : ప్రతివారం కొత్త సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే రానున్న కొద్ది రోజుల పాటు తెలుగుతో పాటు, తమిళ హీరోల చిత్రాలూ పలకరిచ్చేందుకు వస్తున్నాయి. టాలీవుడ్‌లోనూ కోలీవుడ్‌ చిత్రాల హవా కొనసాగనుంది. ఈ మధ్యేనే విశాల్‌ 'సామాన్యుడు'తో థియేటర్‌లో సందడి చేయగా, 'మహాన్‌' అంటూ విక్రమ్‌ ఓటీటీలో అలరించారు. త్వరలోనే ఇంకొంతమంది హీరోలు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వారెవరు? వారి చిత్రాల్లేంటి చూసేద్దాం...

వాలిమై

Ajith valimai movie: 150 కోట్ల భారీ బడ్జెట్‌ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం వాలిమై. అజిత్ హీరో. బోనీకపూర్‌ నిర్మాత. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు. దర్శకుడు వినోద్‌. తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అజిత్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 24 థియేటర్లలో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సూర్య

Suriya ET Movie: జై భీమ్‌ తర్వాత సూర్య ఎలాంటి కథాంశంతో వస్తాడని అంతా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే భిన్నంగా ఎత్తర్కుమ్‌ తునింధవన్‌ (ఈటీ)తో యాక్షన్‌ థ్రిల్లర్‌ను ఎంచుకున్నారు. ఒక సామాన్యుడు సమాజంలోని అన్యాయాలపై తిరబడి ఎదిరించడమే కథాంశం. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. దర్శకుడు పాండీరాజ్‌. 2019లో జరిగిన పొలాచ్చి సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల సంఘటన ఆధారంగా కథ రాసుకున్నట్టు పాండీరాజ్‌ తెలిపారు. ఈ సినిమాలో తెలుగులో కూడా సూర్య సొంతంగా డబ్బింగ్‌ చెప్పాడు. మార్చి 10న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

బీస్ట్​

Vijay Beast movie: తెలుగు తెరను ముంచెత్తుబోతున్న మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ బీస్ట్‌. విజయ్​ హీరోగా దర్శకుడు నెల్సన్‌ తెరకెక్కించారు. ముందు ఈ సినిమాను ఏ.ఆర్‌.మురుగదాస్‌తో మొదలుపెట్టినా తను పారితోషికం అత్యధికంగా డిమాండ్‌ చేయడం వల్ల నెల్సన్‌ను దర్శకుడిగా మార్చారు. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పూజాహెగ్డే తన సొగసులతో అలరించనుంది. ఏప్రిల్​ 2022 ఈ మూవీ విడుదల కానుంది.

కార్తి

Karthi sardar movie: హీరో కార్తి నటించిన సర్దార్​ సినిమా గతేడాది ఏప్రిల్‌లోనే షూటింగ్‌ మొదలైనా.. కొవిడ్‌ కారణంగా నిరవధికంగా వాయిదా వేశారు. కార్తి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో తనకి జోడీగా రాశీఖన్నా, రాజీష విజయన్‌లు నటిస్తున్నారు. పీఎస్‌ మిత్రన్‌ దర్శకుడు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్‌ హక్కులు దక్కించుకుంది. మే 22న ఇది రిలీజ్​ కానుంది.

కమల్​హాసన్​

Kamalhassan vikram movie: విక్రమ్​.. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం.. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకుడు. హిందీ హక్కులు రూ.37 కోట్లకు అమ్ముడయ్యాయి. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాసిల్‌లు సైతం ఇందులో నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్​ చివరి వారంలో ఇది రానుంది.

విజయ్​సేతుపతి

vijaysethupathi samantha nayanthara movie: నయనతార, సమంత.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. అభిమానులకు పండగే కదా! కణ్మని రాంబో ఖతీజాలో ఇదే జరగబోతోంది. ఈ ఇద్దరికీ ప్రియుడిగా విజయ్‌ సేతుపతి నటిస్తున్నాడు. ఇది కామెడీతో కూడిన ముక్కోణపు ప్రేమకథా చిత్రమ్‌. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకుడు. ఏప్రిల్​లో ఈ మూవీ రిలీజ్​ కానుంది.

ధనుష్​

Dhanush Shekarkammula movie: తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి తమిళ్‌ స్టార్‌ ధనుష్‌తో కలిసి చేస్తున్న తొలి చిత్రం 'సర్'​. తమిళంలో ‘వాథీ’గా తెలుగులో ‘సర్‌’గా తెరకెక్కుతోంది. ఇదీ యాక్షన్‌ డ్రామా చిత్రమే. సంయుక్తమేనన్‌ ధనుష్‌కి జోడీ. సాదాసీదా ఓ కాలేజీ లెక్చరర్‌ పరిస్థితుల ప్రభావం కారణంగా చిక్కుల్లో ఇరుక్కుని ఎడ్యుకేషన్‌ మాఫియాతో ఎలా పోరాడి విజయం సాధించాడు అన్నదే కథాంశం. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.

dhanush sir
ధనుష్​ సర్​

ఇదీ చూడండి: ఈ మోడల్ వెరీ హాట్​.. టాప్​ టు బాటమ్​ అందాల జాతరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.