ETV Bharat / sitara

ఫ్యాన్స్​కు సారీ చెప్పిన 'భీమ్లా నాయక్' నిర్మాత - trivikram naga vamsi news

Producer naga vasmhi: తను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత నాగవంశీ వివరణ ఇచ్చారు. ప్రేక్షకులంటే తమకెంతో గౌరవమని చెప్పుకొచ్చారు. వారి మనసు నొచ్చుకోవడం తనను బాధించిందని అన్నారు.

Bheemla nayak Producer naga vasmi
నిర్మాత నాగవంశీ
author img

By

Published : Feb 18, 2022, 6:13 PM IST

Bheemla nayak naga vamsi: సితార ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై పలు సినిమాలు తీస్తున్న నిర్మాత నాగవంశీ.. ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు. 'డీజే టిల్లు' ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి! ఇప్పుడు వీటిపై స్పందించిన వంశీ.. ట్విట్టర్​లో ఫ్యాన్స్​ను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టారు.

"ప్రేక్షకులు అంటే మాకు ఎంతో గౌరవం. ఏ చిత్ర నిర్మాణ సంస్థకైనా వారే బలం. ప్రేక్షకులు పెట్టే విలువైన డబ్బుకు మించిన వినోదం అందించామన్న ఆనందంలో 'డీజే టిల్లు' విడుదలైన రోజు మీడియాతో మాట్లాడుతూ అన్న మాటలు ప్రేక్షకులను ఇబ్బంది కలిగించాయన్న వార్తలు తెలిసి బాధపడ్డాను. ప్రేక్షకులను ఏకవచనంతో సంబోధిస్తూ మాట్లాడటం, వారిని నా సోదరులుగా భావించడం వల్లే. అయినా వారి మనసు నొచ్చుకోవడం పట్ల క్షంతవ్యుడిని. ముందుగా చెప్పినట్లే ఎప్పటికీ ప్రేక్షకులు అంటే మాకెంతో గౌరవం, వారే మా బలం" అని వంశీ తన ట్విట్టర్​లో పేర్కొన్నారు.

పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లా నాయక్'.. ఫిబ్రవరి 25న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు తెలుగు రీమేక్ ఇది. త్రివిక్రమ్.. స్క్రీన్​ప్లే-మాటలు అందించారు. తమన్ సంగీతమందించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.

Bheemla nayak movie
భీమ్లా నాయక్ మూవీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.