ETV Bharat / sitara

చరణ్​ అభిమానులకు ఒకేరోజు రెండు సర్​ప్రైజ్​లు - ఆర్​ఆర్​ఆర్​

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ పుట్టిన రోజు సందర్భంగా 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం నుంచి తొలిరూపు విడుదల చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్​ చిరంజీవి తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్​లుక్​ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Two surprises ahead for Ram Charan fans?
మెగా పవర్​స్టార్​ బర్త్​డేకు అభిమానులకు శుభవార్త
author img

By

Published : Feb 20, 2020, 7:14 AM IST

Updated : Mar 1, 2020, 10:10 PM IST

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ మార్చి 27న తన 37వ ఏట అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రంలో అతడు నటిస్తున్న అల్లూరి సీతారామరాజు పాత్ర ఫస్ట్​లుక్​ విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అదే రోజు చిరు-కొరటాల శివ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్​లుక్​ను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు రామ్​చరణ్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.

ప్రస్తుతం రామ్‌చరణ్‌.. ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్నాడు. ఇందులో అతడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి.. 'నా మొదటి ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు'

Last Updated : Mar 1, 2020, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.