రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక ప్రజలను ఆకట్టుకునేందుకు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆ క్రమంలో నేడు రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి', మరొకటి మోహన్‌లాల్ 'లూసిఫర్'. ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాల్సిందే.
ఫ్లాపుల నుంచి మెగా హీరో 'తేజ్' గట్టేక్కేనా..!
వరుసగా ఆరు ఫ్లాపులు... ఈ సమయంలో ఏ నిర్మాత లేదా దర్శకుడైన ఆ హీరోతో సినిమా చేయాలంటే ఆలోచిస్తారు. కానీ తనను తాను పూర్తిగా మార్చుకుని సరికొత్తగా వస్తున్నాడు సాయిధరమ్ తేజ్. సరికొత్త ప్రేమకథ 'చిత్రలహరి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రానికి దర్శకుడు కిశోర్ తిరుమల. కల్యాణి ప్రియదర్శన్, నివేది పేతురాజ్ హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్...అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
మలయాళ హీరో ఇక్కడ మెరిసేనా..
జనతా గ్యారేజ్, మన్యం పులి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు మోహన్‌లాల్. మలయాళంలో సూపర్‌హిట్ అయిన 'లూసిఫర్'ను అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మలయాళంలో విడుదలైన 8 రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించింది ఈ సినిమా. అత్యంత వేగంగా ఆ మైలురాయిని చేరుకున్న చిత్రంగా నిలిచింది. మంజూ వారియర్, వివేక్ ఒబెరాయ్ ఇతర పాత్రలో నటించారు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి.