సినిమా హీరోల పుట్టినరోజు అంటే అభిమానుల్లో సందడి మాములుగా ఉండదు. అభిమానుల కేకు కట్టింగ్లు, వేడుకలతో అదిరిపోతుంది. ఇక పవర్‌స్టార్ బర్త్‌డే(Pawan Kalyan Birthday Celebrations) అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ఆఫ్‌లైన్‌లో కటౌట్ల నుంచి ఆన్లైన్లో బర్త్‌డే ట్రెండ్ల వరకు ఓ పండగ వాతావరణం కనిపిస్తుంది. అందుకోసమే ఈసారి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్(Pawan Kalyan) పుట్టినరోజు(సెప్టెంబరు 2)న అభిమానులకు రెండు భారీ సర్ప్రైజ్లు రానున్నట్లు తెలుస్తోంది.
'వీరమల్లు' అప్డేట్..
పవన్‌కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు'(HariHara VeeraMallu). నిధి అగర్వాల్(Nidhhi Agerwal) కథానాయిక. జాక్వెలిన్ ఫెర్నాండేజ్(Jacqueline Fernandez) కీలకపాత్ర పోషిస్తుంది. ఏఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పవర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబరు 2న ఈ చిత్రం నుంచి కీలక అప్డేట్ రానుందని సమాచారం. దాంతో పాటు సినిమా రిలీజ్ డేట్‌నూ ప్రకటించే అవకాశం ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'భీమ్లా నాయక్' తొలి సాంగ్
మలయాళ సూపర్‌హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లో పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్-రానా దగ్గుబాటి(Rana Daggubati) ప్రధానపాత్రలో నటిస్తున్నారు. భీమ్లా నాయక్(Bheemla Nayak) పాత్రలో పవన్.. డానియల్ శేఖర్‌గా రానా నటిస్తున్నారు. ఇటీవలే పవన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేయగా.. అభిమానుల నుంచి విశేషాదరణ లభించింది. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని తొలి సాంగ్‌ను(Bheemla Nayak Song) విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. భీమ్లా నాయక్ మాస్‌లుక్ అదరహో!