ETV Bharat / sitara

భాజపా నేత ట్వీట్​కు హీరో సిద్ధార్థ్ కౌంటర్ - siddharth news

హీరో సిద్ధార్థ్​కు భాజపా నేతలకు మధ్య వివాదం జరుగుతోంది. ఏపీ భాజపా నేత విష్ణువర్ధన్ చేసిన ట్వీట్​కు సిద్ధార్థ్ ఇచ్చిన కౌంటర్​ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Twitter fight between siddharth vishnu vardhan reddy
సిద్ధార్థ్
author img

By

Published : May 7, 2021, 6:58 PM IST

భారతీయ జనతా పార్టీకి, సిద్ధార్థ్‌కు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం రోజురోజుకూ ముదిరిపోతోంది. కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం ప్రజలకు సాయం చేసే విషయంలో ఎన్నో సందర్భాల్లో విఫలమైందని పేర్కొంటూ గత కొన్నిరోజుల నుంచి సిద్ధార్థ్‌ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భాజపాపై ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ పార్టీని తప్పుబడుతున్న సిద్ధార్థ్‌కు సరైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ భాజపా నేత విష్ణువర్ధన్‌ రెడ్డి ఓ ట్వీట్‌ పెట్టారు. "సిద్ధార్థ్‌.. నీ సినిమాలన్నింటికీ దావూద్‌ ఇబ్రహీం పన్ను చెల్లిస్తాడట కదా? ముందు దీనికి సమాధానం చెప్పు" అని సిద్ధార్థ్‌ను ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించారు.

vishnu vardhan reddy
ఏపీ భాజపా నేత విష్ణువర్ధన్

ఈ ట్వీట్‌కు తాజాగా సిద్ధార్థ్‌ కౌంటర్‌ వేశారు. "నో. దావూద్‌ ఇబ్రహీం నా పన్నులు కట్టడం లేదు. అందుకు ఆయన సిద్ధంగా కూడా లేరు. నేను నిజమైన దేశ పౌరుడిని. అలాగే పన్ను చెల్లించే వ్యక్తిని" అంటూ సమాధానమిచ్చారు.

మరోవైపు, ఇటీవల తమిళనాడుకు చెందిన కొంతమంది భాజపా నేతలు తన ఫోన్‌ నంబర్‌ లీక్‌ చేశారని.. దాంతో తనకు, తన కుటుంబానికి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని సిద్ధార్థ్‌ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈ విషయమై ఆయన పోలీసులనూ సంప్రదించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.