నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'టక్ జగదీష్'. రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని ఓ సాంగ్ ఆకట్టుకోగా.. నేడు మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'కోలో కోలన్న కోలో' అంటూ సాగే పాట అలరిస్తోంది. తమన్ సంగీతం, కల్యాణ్ మాలిక్ గాత్రం ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తండ్రీకొడుకులు చియాన్ విక్రమ్-ధృవ్ కాంబోలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రం 'చియాన్ 60(వర్కింగ్ టైటిల్)'. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా వాణీ భోజన్ను ఎంపిక చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని నేడు అధికారికంగా ప్రకటించింది. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
![Vani Bhojan onboard Chiyaan60](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10989396_has.jpg)