ETV Bharat / sitara

త్రివిక్రమ్​ కొత్త సినిమా.. ప్రధాన పాత్రలో సమంత! - సమంత కొత్త సినిమా

Trivikram samantha movie: హీరోయిన్​ సమంత కోసం దర్శకుడు త్రివిక్రమ్​ ఓ లేడి ఓరియెంటెడ్​ కథను సిద్ధం చేసినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Trivikram samantha movie
త్రివిక్రమ్​ సమంత సినిమా
author img

By

Published : Jan 15, 2022, 3:30 PM IST

Trivikram samantha movie: స్టార్​ హీరోయిన్​ సమంత విడాకుల తర్వాత కెరీర్​పై పూర్తి దృష్టి సారించింది. ఓవైపు వరుసగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో క్రేజీ ఆఫర్​ వరించబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు త్రివిక్రమ్..​ సామ్​ కోసం ఓ వైవిధ్యభరితమైన కథను సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆమెను కలిసి కథను వివవించనున్నారట!

త్రివిక్రమ్​.. చివరిసారిగా 'అలవైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. త్వరలోనే మహేశ్​, ఎన్టీఆర్​తో రెండు సినిమాలను చేస్తారని కొంతకాలంగా వినిపిస్తోంది. కానీ అవి తెరకెక్కడానికి చాలా సమయం పడుతుందట! ఆలోపు సమంతతో ఓ ప్రాజెక్ట్​ను పూర్తి చేయాలని ఆయన​ భావిస్తున్నారట. ఇందుకోసం ఓ లేడి ఓరియెంటెడ్​​ కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

కాగా, త్రివిక్రమ్​.. త్వరలోనే రానున్న 'భీమ్లానాయక్'​ సినిమాకు స్క్రీన్​ ప్లే, డైలాగ్స్​ అందించారు. మరోవైపు సమంత.. ఇటీవలే 'పుష్ప' చిత్రంలోని ఓ స్పెషల్​ సాంగ్​తో అభిమానులను అలరించారు.

ఇదీ చూడండి: Hero movie review: 'హీరో' సినిమా ఎలా ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.