టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన 19వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఆయనపై కీలక ఘట్టాలను తెరకెక్కించింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి బన్నీ డబ్బింగ్ కూడా మొదలు పెట్టేశాడు. టాకీ పనులు ప్రారంభించే ముందు గురువారం పూజా కార్యక్రమాలు చేపట్టాడీ మెగాహీరో.
ఇందులో అల్లు అర్జున్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించనున్నట్లు సమాచారం. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ బాణీలు సమకూర్చాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా 'ఐకాన్' అనే చిత్రం తెరకెక్కనుంది. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా రాశీ ఖన్నాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.