ETV Bharat / sitara

మెగాస్టార్​తో మళ్లీ ఛాన్స్​.. ఈసారైన కుదిరినట్టేనా! - చిరంజీవి తాజా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య'లో నటిస్తున్నారు. ఆ తర్వాత మరో మూడు చిత్రాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో మెహర్ రమేష్​తోనూ ఓ సినిమా ఉండబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో తెరకెక్కబోయే మూవీలో హీరోయిన్​గా త్రిష చేయనుందని తెలుస్తోంది.

త్రిష
త్రిష
author img

By

Published : May 14, 2020, 1:24 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇకపై సినిమాల విషయంలో జోరు చూపించనున్నారు. ఇప్పటికే ఆయన 'ఆచార్య' చిత్రం తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయమై ఓ ప్రణాళిక సిద్ధం చేసేసుకున్నారు. వీటిలో రెండు సుజీత్, బాబీ వంటి యువ దర్శకులతో చేయాల్సి ఉంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు. అయితే రమేష్‌తో చిరు చేయబోయే చిత్రం 'వేదాళం' రీమేక్‌ అని.. ఇప్పటికే ఈ స్క్రిప్ట్‌ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.

తాజాగా ఈ చిత్ర కథానాయిక పాత్రకు సంబంధించి చిత్ర పరిశ్రమలో కొన్ని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో చిరుకు జోడీగా త్రిషను తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. నిజానికి ప్రస్తుతం మెగాస్టార్‌ చేస్తున్న 'ఆచార్య' కోసం తొలుత త్రిషనే ఎంపిక చేసుకుంది చిత్రబృందం. కానీ, మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమాలో నటించే అవకాశం రావడం వల్ల ఆమె అనూహ్యంగా చిరు చిత్రం నుంచి తప్పుకుంది. దీనిపై ఆ మధ్య చిన్నస్థాయి చర్చే నడిచింది. కానీ, ఇవేమీ పెద్దగా పట్టించుకోని చిరంజీవి ఇటీవల త్రిష జన్మదినం సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేసి ఆమెతో ఎలాంటి విభేదాలు లేవన్న సంకేతాల్ని ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 'వేదాళం' రీమేక్‌లో ఆమె కనిపించనుందనే వాదన మొదలైంది. మరి నిజంగా ఆ రీమేక్‌ ఉందా? ఉంటే త్రిషనే కథానాయికగా తీసుకుంటారా? అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.