మణిరత్నం దర్శకత్వంలో త్రిష, జయం రవి 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో త్రిష.. రవికి సోదరిగా నటించనుందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడం వల్ల త్రిష అభిమానులు కంగుతిన్నారు.
త్రిష ఇప్పటికే జయం రవి సరసన 'సమ్‌థింగ్ సమ్‌థింగ్', 'సకల కల వల్లవన్', 'భూలోహమ్' తదితర చిత్రాల్లో నటించింది. జయం రవి, విక్రమ్‌లతో కలిసి నటించిన త్రిష అరుల్మోజీ వర్మన్, ఆదిత్య కరికలన్లకు సోదరిగా కుందవై పాత్ర పోషించింది. అయితే అప్పుడు త్రిష సోదరిగా నటించినప్పటికి అది నాయికా ప్రాధాన్యమున్న చిత్రం.
ప్రముఖ నటులందరూ ఒకేచోట
'పొన్నియన్ సెల్వన్' మణిరత్నం కెరీర్లోనే అతి పెద్ద సినిమా. ఇందులో ప్రముఖ నటులు విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్య రాజేశ్, అదితీరావ్, ఐశ్వర్యా లక్ష్మీ, జయరామ్, శరత్‌కుమార్, ప్రభు తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఏఆర్. రెహమన్ సంగీతం అందిస్తుండగా, మణిరత్నానికి చెందిన మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మాణ బాధ్యతలు చేపట్టాయి.
ఇదీ చూడండి.. 'డిస్కోరాజా'.. అభిమానులు మెచ్చిన మాస్ మహారాజా